‘హరిహర వీరమల్లు’ సినిమా క్లైమాక్స్‌ని తాను ఎందుకు డైరెక్ట్ చేయవలసి వచ్చిందో తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన టైటిల్ రోల్‌లో నటించిన ఈ మచ్ అవైటెడ్ మూవీ రేపు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, తన తాజా చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన హరిహర వీరమల్లు రాజకీయాలకు అతీతంగా ఉంటుందని తెలిపారు. అలాగే కుటుంబంతో కలిసి చూడదగిన మంచి వినోదాత్మక చిత్రంగా అభివర్ణించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం బాధ్యతలు తన నటనపై ఎలాంటి ప్రభావం చూపలేదని, ప్రేక్షకులు తాను సినిమా కోసం తగినంత కష్టపడలేదని అనుకోవద్దని అన్నారు. ఔరంగజేబ్ చేసిన అరాచకాలు, ఇతర చారిత్రక అంశాలు చిత్రంలో ఉంటాయని, అయితే ధర్మం ఇందులో ఒక భాగం మాత్రమేనని స్పష్టం చేశారు. క్లైమాక్స్‌లోని విశిష్టత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, దీనిలో ఎంతో డెప్త్ ఉంటుందని, ఆ సన్నివేశలను ఎంతో ఇంటెన్సిటీతో చేయాల్సి ఉంటుందని, అందుకే ఇన్ని సినిమాలు చేసిన అనుభవంతో క్లైమాక్స్‌కు తాను దర్శకత్వం వహించానని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























