వరుస హిట్లతో పీక్ ఫామ్ లో వున్న తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి నెక్స్ట్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్యకి ఇది 46వ సినిమా.షూటింగ్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది.ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తి చేశారు.పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ఇక ఈసినిమా నుండి సూర్య స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈరోజు సూర్య బర్త్ డే కావడంతో ఈపోస్టర్ ను రిలీజ్ చేసి విషెస్ తెలిపింది సూర్య 46 టీం. ఇందులో సూర్య వింటేజ్ లుక్ లో కనిపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో ప్రేమలు ఫేమ్ మామితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా రవీనా టాండన్ ,రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.చాలా గ్యాప్ తరువాత సూర్య తెలుగులో చేస్తున్న సినిమా ఇదే.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.వచ్చే ఏడాది ఫిబ్రవరి లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక సూర్య ఈసినిమా కన్నా ముందు కరుప్పు తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.షూటింగ్ కంప్లీట్ కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఈరోజు సూర్య బర్త్ డే సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా త్రిష కథానాయికగా నటించింది.యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.దీపావళికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.తెలుగులోకూడా ఈసినిమా కరుప్పు అనే టైటిల్ తోనే విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























