చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది హిందీ సినిమా సయారా. ఎక్స్ లెంట్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడం తో మొదటి మూడు రోజుల్లోనే 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసి సెన్సేషన్ సృష్టించింది. ఇక నిన్న వర్కింగ్ డే కూడా సాలిడ్ హోల్డ్ ను కొనసాగించి ప్రపంచ వ్యాప్తంగా 35కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి రోజు 29. 21 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకోగా నాలుగో రోజు అది వర్కింగ్ డే లో అంతకు మించి రాబట్టిందంటే గ్రోత్ ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా చూస్తే సయారా నాలుగు రోజుల్లో 108.75 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది దాంతో ఈఏడాది 100కోట్ల క్లబ్ లో చేరిన 7వ సినిమాగా రికార్డు సృష్టించింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా నాలుగు రోజుల్లో 150 కోట్ల వసూళ్లను రాబట్టింది. ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో ఈజీగా 500కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది. స్టార్ కాస్ట్ లేకుండా వచ్చి అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది సయారా.లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో అహాన్ పాండే ,అనీత్ పడ్డా జంటగా నటించిన ఈసినిమాను మోహిత్ సూరి తెరకెక్కించగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























