కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, త్రిష జంటగా నటిస్తున్న మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘కరుప్పు’. దీనికి తమిళంలో ‘నలుపు’ అని అర్ధం. ప్రముఖ నటుడు ఆర్ జె బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. రీసెంట్గా ఈ మూవీ టైటిల్‌తో పాటు సూర్య ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో నేడు హీరో సూర్య జన్మదినం సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా కట్ చేసిన ఈ టీజర్ అదిరిపోయింది. ఓ మాస్ పండుగలా ఉంది. సూర్య పవర్ఫుల్ అవతార్‌లో అదిరిపోయే లుక్‌తో కనిపించారు. ఆ ఇంటెన్సిటీ, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అంచనాలకు మించి వుంది. 1 నిమిషం38 సెకన్ల టీజర్లో మాస్ మోమెంట్స్, ఫైర్ విజువల్స్, పవర్ ఫుల్ బీజీఎం అన్నీ అద్భుతంగా వున్నాయి.
‘కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించే శాంతించే దేవుడు కాదు.. మనసులో మొక్కుకుని మిరపకాయలు దంచితే రుద్రుడే దిగొచ్చే దేవుడు’ అంటూ సూర్య చెప్పే డైలాగ్‌తో మొదలైన టీజర్.. ఆ తర్వాత ‘నా పేరు సూర్య, నాకు ఇంకో పేరుంది’.. ‘ఇది మన టైమ్’ అంటూ చెప్పడం గూజ్ బంప్స్ తెప్పించింది. యాక్షన్ సీన్స్ విజిల్స్ వేయించేలా ఉన్నాయి.
ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా, ఆయనకు మాస్ జానర్లో చేసిన తొలి ప్రాజెక్ట్. సోషల్ కథలతో గుర్తింపు తెచ్చుకున్న బాలాజీ ఇప్పుడు సూర్యతో కలిసి ఒక స్ట్రాంగ్, కమర్షియల్ సినిమాని తీసుకొచ్చారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ చాలా గ్రాండ్‌గా ఉంది. ప్రతి సీన్లో గ్రాండ్‌నెస్ కనిపిస్తోంది.
ఇక సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు జోష్ తీసుకొచ్చింది. సాయి ప్రస్తుతం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్‌గా ఎదుగుతున్నాడు, ఈ మూవీ అతని కెరీర్లో టర్నింగ్ పాయింట్ కానుంది. అలాగే అరుణ్ వెంజరముడు ప్రొడక్షన్ డిజైన్ విజువల్స్‌కి మంచి డెప్త్ వచ్చేసింది. ఎడిటింగ్‌లో కలైవాణన్ కట్లూ పర్ఫెక్ట్, పేస్ తగ్గకుండా స్టైల్ చూపించారు.
అలాగే యాక్షన్ కొరియోగ్రఫీ అదిరిపోయింది. అన్బరివ్, విక్రమ్ మోర్ కలిసి పర్ఫెక్ట్ మాస్ సీక్వెన్స్‌లు అందించారు. అయితే త్రిష లుక్‌ని మాత్రం ఇంకా రివీల్ చేయలేదు, థియేట్రికల్ ట్రైలర్ కోసం హోల్డ్ చేసినట్టున్నారు. ఇతర క్యాస్టింగ్ కూడా చాలా బలంగా ఉంది. ఇంద్రన్స్, స్వసిక, అనఘ మాయ రవి, శివధా, నట్టి, సుప్రీత్ రెడ్డి ఇలా ఒక్కొక్కరు బలమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ టీజర్ చూసాక కరుప్పు మాస్‌కి ఓ గిఫ్ట్‌లా రాబోతుందని అర్ధమౌతోంది.
ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని SR ప్రకాష్‌బాబు, SR ప్రభు సోదరులు ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్, ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది.
ఇక సూర్య ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ‘కరుప్పు’ ఫస్ట్ లుక్, టీజర్ సూర్య బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్‌కి ఇది డబుల్ ట్రీట్ అయింది. మొత్తానికి ఈ టీజర్‌తో సూర్య బర్త్ డే రోజున ఆయన అభిమానులకు మేకర్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారనే చెప్పాలి. ఇక ఈ సినిమాని దీపావళి ఫెస్టివల్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. పండగ సెలబ్రేషన్ ఇప్పుడే మొదలైందని సూర్య ఫాన్స్ అంటున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























