హరిహర వీరమల్లు.. నేడే బిగ్ ఈవెంట్, హాజరవుతోన్న అతిరధమహారథులు

Hari Hara Veera Mallu Mega Event to be Held Today With Political Bigwigs

తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ హిస్టారికాల్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ అడ్రినలిన్-చార్జ్డ్ రైడ్‌ నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. ఈ బిగ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా భారీగా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు మేకర్స్. ఇక చిత్ర యూనిట్ అంతా పాల్గొననుండగా.. హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలనున్నారు. అలాగే ఈ వేడుకకు అతిరథమహారథులు హాజ‌రు కానున్నారు.

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, కర్ణాటక అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరితోపాటు మూవీలో నటించిన హీరోయిన్ నిధి అగర్వాల్ సహా చిత్ర యూనిట్ అంతా హాజరుకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.