టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే కోట శ్రీనివాసరావు, ఆ తర్వాత బి. సరోజాదేవి వంటి దిగ్గజ నటీనటులను కోల్పోయిన చిత్ర పరిశ్రమ ఇప్పుడు మరో ప్రముఖ నటుడి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తాజాగా నటుడు ఫిష్ వెంకట్ కన్ను మూశారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఫిష్ వెంకట్ నాలుగేళ్ల నుంచి కిడ్నీల సమస్యతో బాధ పడుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు దెబ్బతినడంతో తరచుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. దీనికి సంబంధించి బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో గత కొన్ని వారాలుగా చికిత్స తీసుకుంటున్నారు. అయితే రోజురోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు వెంకట్ కి కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు.
అయితే ఆర్ధికంగా స్థోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులు సహాయం కోసం విజ్ఞప్తి చేశారు. హీరోలు విశ్వక్ సేన్, కృష్ణ మానినేని వంటి వారు కొంత ఆర్థిక సాయం అందించారు. అయినా సర్జరీకి సరిపడా మొత్తం సమకూరలేదు. ఈ క్రమంలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వెంకట్ శరీరం చికిత్సకు సహకరించక చివరకు ప్రాణాలు విడిచారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























