బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ కలిసి నటించిన చిత్రం భైరవం. మే 30న థియేటర్లలో రిలీజ్ కాగా పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. అయితే ఆశించిన విజయాన్ని మాత్రం సాధించలేకపోయింది. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల తమిళ సినిమా గరుడన్ కు రీమేక్ గా భైరవం ను తెరకెక్కించాడు. ఇక ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు తోపాటు హిందీ లో ఈరోజు నుండి జీ 5 స్ట్రీమింగ్ లోకి తోసుకొచ్చింది.మరి ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ ఈసినిమాను నిర్మించగా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై హీరోయిన్లుగా నటించారు. ఇక ఈసినిమా తో సాయి శ్రీనివాస్ , మంచు మనోజ్ ,నారా రోహిత్ చాలా గ్యాప్ తరువాత ప్రేక్షకులముందుకు వచ్చారు. ఈముగ్గురు తమ పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకున్నారు.
ఇక సాయి శ్రీనివాస్ ప్రస్తుతం టైసన్ నాయుడు , కిష్కింధపురి ,హైందవ సినిమాలు చేస్తున్నాడు. మంచు మనోజ్ మిరాయ్ లో నటిస్తున్నాడు. ఇందులో తేజా సజ్జా హీరో గా నటిస్తుండగా మనోజ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.సెప్టెంబర్ 5న విడుదలకానుందని ప్రకటించారు. ఇక నారా రోహిత్ సుందరకాండ అనే సినిమా చేస్తున్నాడు.ఈసినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























