మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి హిందీ సినిమా ‘వార్ 2’. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించగా.. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంటే నేటినుంచి సరిగ్గా మరో 30 రోజుల్లో వార్ 2 థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో ఎన్టీఆర్ దీనిపై స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా “ఎదురుచూసిన సమయం త్వరలో ముగుస్తుంది. యుద్ధం మొదలవుతుంది… వార్ 2 రావడానికి ఇంకో 30 రోజులు మాత్రమే మిగిలాయి. వార్ 2 ఆగస్టు 14న థియేటర్లలో మాత్రమే చూడండి. హిందీ, తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదలవుతోంది” అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ఇదిలావుంటే, ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ ఫిల్మ్ కావడంతో ఇటు టాలీవుడ్ సహా అటు హిందీ చిత్ర పరిశ్రమలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు హృతిక్ రోషన్ ఉండటంతో ఇరువురి అభిమానులతోపాటుగా మూవీ లవర్స్ కూడా దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
అయితే వార్ 2కి బాక్సాఫీస్ వద్ద ‘కూలీ’ రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కూడా ఆగస్టు 14నే విడుదలకానుండటం తెలిసిందే. ఇక ఈ మూవీలో కింగ్ నాగార్జున కూడా నటిస్తుండడంతో తమిళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. ఉపేంద్ర,శృతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























