నాగార్జున గారు అంత ఈజీగా కూలీ ఒప్పుకోలేదు -లోకేష్ కనగరాజ్

Nagarjuna didn’t accept Coolie right away reveals Lokesh Kanagara

సూపర్ స్టార్ రజినీకాంత్- సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీపై అంచనాలు ఏ రేంజ్ లో వున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అందుకు తగ్గట్లే కోలీవుడ్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది.ఇక ఈసినిమాలో కింగ్ నాగార్జున ,ఉపేంద్ర ,సౌబిన్ షరీఫ్ ,సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనుండగా అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో కనిపించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈ సినిమా కోసం అందరిని ఒప్పించడం చాలా ఈజీగా గానే అయిపొయింది కానీ నాగార్జునను మాత్రం ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకరావడానికి లోకేష్ శ్రమించాల్సి వచ్చిందట.రెండేళ్లు ఈసినిమాపైనే కూర్చున్నా రజినీకాంత్ గారు ఫస్ట్ నరేషన్ లోనే ఓకే చెప్పారు. అయితే నాగార్జున సర్ ను ఒప్పించడానికి చాలా టైం పట్టింది. ఏడెనిమిది సార్లు నరేషన్ ఇచ్చాక అయన సైమన్ పాత్ర చేయడానికి అగీకరించారు.అయన 40 ఏళ్ళ కేరిర్ లో ఇంతకుముందెప్పుడు ఇలాంటి రోల్ చేయలేదు.అంటూ లోకేష్ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

నాగార్జునతో ఈసినిమాలో బ్యాడ్ వర్డ్స్ కూడా పలికించాడట లోకేష్.అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 14న థియేటర్లోకి రానుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కూలీ మొదటి రోజు రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.ఆగస్టు 2న ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.