ఉస్తాద్ రామ్ పోతినేని -డైరెక్టర్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా ఇప్పటివరకు ఈసినిమానుండి పోస్టర్స్ తోపాటు టైటిల్ గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు.ఈనెల 18న విడుదలకానుంది.ఈసాంగ్ ను రామ్ రచించడం విశేషం.ఫస్ట్ టైం రామ్ ఈసాంగ్ కోసం లిరిక్ రైటర్ గా మారాడు.ఇక ఈరొమాంటిక్ మెలోడీ సాంగ్ ను టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాడాడు అని ఇంతకుముందే న్యూస్ రాగ తాజాగా మేకర్స్ ఆ విషయాన్ని కంఫర్మ్ చేశారు.అనిరుధ్ వాయిస్ తో ఫస్ట్ సింగిల్ వస్తుందని పోస్టర్ ద్వారా ప్రకటించారు.దాంతో సాంగ్ పై భారీ అంచనాలు వున్నాయి.మరి రామ్ నుండి వస్తున్న ఈ ఫస్ట్ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక షూటింగ్ విషయానికి వస్తే హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.దాదాపు నెలరోజులకు పైగా జరుగనున్న ఈషెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది.ఓ ఫ్యాన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇందులో ఉపేంద్రకు వీరాభిమానిగా సాగర్ అనే పాత్రలో రామ్ కనిపించనున్నాడు.భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ -మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























