నేను సినిమాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఆ ఇద్దరే – కిరీటి

Shivanna and Puneeth Rajkumar Are My Inspiration to Enter Films, Says Hero Kireeti

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్‌’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నటి జెనీలియా, సీనియర్ నటుడు రవిచంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్‌ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మేకర్స్ బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా హీరో కిరీటి మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. శివన్న గారికి కృతజ్ఞతలు. శివన్న గారు, అప్పు గారు నేను సినిమాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్. నాకు ఇంత మంచి సినిమాతో లాంచ్ చేస్తున్న నిర్మాత సాయి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను.”

“డైరెక్టర్ రాధాకృష్ణ ఈ సినిమా కోసం మూడేళ్లు డెడికేటెడ్‌గా వర్క్ చేశారు. ఒక బ్రదర్ లాగా సపోర్ట్ చేశారు. ఆయన తప్పకుండా భవిష్యత్తులో చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. జెనీలియా గారు 13 ఏళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కం బ్యాక్ ఇస్తున్నారు. ఆమెతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్‌. రవిచంద్రన్ గారితో వర్క్ చేయడం నా అదృష్టం. ఆయనతో పనిచేస్తున్న రోజులని నా జీవితంలో మర్చిపోలేను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.”

“మా నాన్నగారు నాకోసం చాలా త్యాగాలు చేశారు. ఆయన కొడుకుగా పుట్టడం నా అదృష్టం. సెంథిల్ గారు నన్ను అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ప్రతి ఫ్రేమ్‌ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. విజువల్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. శ్రీ లీల ఎనర్జిటిక్ కోస్టార్. చాలా డెడికేషన్‌తో ఈ సినిమా చేశారు. జూలై 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మీరందరూ గొప్ప మనసుతో ఆశీర్వదించి సినిమాకి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.