ఈ సినిమాని మాత్రం థియేటర్స్‌లో మిస్ అవ్వొద్దు

Director Praveena Paruchuri Says, Don't Miss Kothapallilo Okappudu in Theatres

స్టార్ హీరో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్‌, టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా టీం ప్రెస్ మీట్ నిర్వహించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఇది నా మూడో సినిమా. అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని అనుకున్నాను. ఒక పల్లెటూరిని ఒక ఫారిన్ సినిమాటోగ్రాఫర్‌తో షూట్ చేయించాం. ఈ సినిమాకి ఒక ఫారిన్ డీవోపీ పనిచేస్తున్నారు. నేను ఫస్ట్ సినిమా ‘కేరాఫ్ కంచరపాలెం’ తీశాను. జీవితంలో ఒక్క సినిమా చాలు అనుకున్నాను. ఆ సినిమాకి ఆడియన్స్ చాలా పెద్ద విజయాన్ని ఇచ్చారు. ఆడియన్స్ ఎంకరేజ్‌మెంట్ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ప్రేక్షకుల ప్రోత్సాహం వలన నేను మరో సినిమా తీయగలిగాను” అని చెప్పారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. “కంచరపాలెం సినిమాని చాలామంది థియేటర్స్‌లో చూడలేదని చెప్తుంటారు. దయచేసి ఈ సినిమాని మాత్రం థియేటర్స్‌లో మిస్ అవ్వొద్దు. సినిమా చాలా గమ్మత్తుగా ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు చాలా హాయిగా నవ్వుకుంటారు. సెకండ్ హాఫ్‌లో నా స్టైల్‌లో కొన్ని సెన్సిబిలిటీస్ కాన్సెప్ట్స్ ఉంటాయి. తప్పకుండా ఆలోచన కలిగించేలా ఉంటుంది. ఈసారి నేను డైరెక్షన్ చేసిన సినిమా ఇది. మీ మీద నమ్మకంతోనే చేశాను. ఈ సినిమాని ఆదరిస్తారని మీపై నాకు పూర్తి నమ్మకం ఉంది” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.