ఓజీ షూటింగ్ కంప్లీట్ 

The shoot of OG has been wrapped up

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.రీసెంట్ గానే పవన్ తన పార్ట్ తాలూకు షూటింగ్ కంప్లీట్ చేయగా నిన్నటి తో ప్యాచ్ వర్క్ కూడా పూర్తిఅయింది.దాంతో షూటింగ్ అంతా ఫినిష్ చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా తొందరగానే పూర్తి చేసి సినిమాను చెప్పిన తేదీకే రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో అదరగొడుతుంది.నిర్మాతలు థియేట్రికల్ రైట్స్ కోసం భారీ రేట్ల ను కోట్ చేస్తున్న బయ్యర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 300కోట్ల బిజినెస్ చేయనుంది.ఓజీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.డివివి దానయ్య ఈసినిమాను నిర్మిస్తున్నాడు.సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.

ఇక పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా శ్రీ లీల ఓ హీరోయిన్ గా నటిస్తుంది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

ఇదిలావుండగా మరి కొన్ని రోజుల్లో పవన్,హరి హర వీరమల్లుతోప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఈనెల24 న విడుదలకానుంది.పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను క్రిష్ ,జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు.     

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.