యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా వున్నాడు. అందులో మాస్ డైరెక్టర్ సంపత్ నందితో చేస్తున్న భోగి ఒకటి.పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది.శర్వా కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీ గా తెరకెక్కుతుంది.ఇందులో శర్వా సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.గత కొన్ని రోజుల నుండి హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈషెడ్యూల్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా పాల్గొనుంటుంది.అక్టోబర్ లోపు షూట్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఈసినిమాలో డింపుల్ హయాతి మరో హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో కె కె రాధామోహన్ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక శర్వానంద్ ప్రస్తుతం భోగి తోపాటు శర్వా 36 అలాగే నారీ నారీ నడుమ మురారి సినిమాలు చేస్తున్నాడు.శర్వా 36వ సినిమాను అభిషేక్ కంకర డైరెక్ట్ చేస్తున్నాడు.అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఇప్పటివరకు ఈసినిమా నుండి పెద్దగా అప్డేట్స్ ఏమి బయటికి రాలేదు.గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.
ఇక నారీ నారీ నడుమ మురారిని సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజుడైరెక్ట్ చేస్తుండగా సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నాడు.ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























