హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ‘మహావతార్’ సిరీస్‌లో భాగంగా ముందుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మహావతార్ నరసింహ’. విజువల్ వండర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ శక్తివంతమైన కథనంతో ఆడియెన్స్‌కి రేపు థియేటర్లలో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ అయితే అత్యద్భుతంగా వుంది. హిరణ్యకశిపుడు బ్రహ్మ దేవుడి వరం కోసం ఘోర తపస్సు చేసే సీక్వెన్స్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. విష్ణువుపై భక్తితో ప్రహ్లాదుడు, తన నాస్తిక తండ్రి హిరణ్యకశిపుడి నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. ప్రహ్లాదుడిని రక్షించడానికి దిగివచ్చిన విష్ణువు అవతారమైన మహావతార్ నరసింహుడి రాకతో ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించింది.
ఎపిక్ విజువల్స్, అద్భుతమైన నేపథ్య సంగీతంతో ఈ ట్రైలర్ విజువల్ వండర్‌లా వుంది. భారతీయ పురాణాలలోని ఈ ఐకానిక్ కథను ఇంత అద్భుతంగా చూపడం ఇంతవరకు చూడలేదు. ఈ ట్రైలర్‌తో సినిమా నెక్స్ట్ లెవల్‌కి చేరుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శిల్పా ధావన్ మాట్లాడుతూ.. “శ్రీ నరసింహ, శ్రీ వరాహుల ఇతిహాస కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము! ప్రతి ఫ్రేమ్, ప్రతి క్షణం, ప్రతి హార్ట్ బీట్ ఈ గొప్ప కథకు ప్రాణం పోసింది. నర్సింహ గర్జన వస్తోంది” అన్నారు.
అలాగే దర్శకుడు అశ్విన్ కుమార్ మాట్లాడుతూ.. “మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ మొట్టమొదటి యానిమేటెడ్ ఫీచర్ ట్రైలర్‌ను ఆయన కృపతో ఆవిష్కరించారు. డివైన్ జర్నీ ప్రారంభమైయింది. క్లీమ్ ప్రొడక్షన్స్ విజన్, ప్రేక్షకుల కోసం న్యూ ఏజ్ మీడియా, స్క్రీన్‌తో భారత్ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవాలనే కల సజీవంగా ఉంది” అని అన్నారు.
ఇక మహావతార్ నరసింహకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హోంబలే ఫిల్మ్స్ సమర్పించిన శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మిస్తున్నారు. ఈ డైనమిక్ భాగస్వామ్యం సినిమాటిక్ అద్భుతాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిత్రం 3Dలో ఐదు భారతీయ భాషలలో 2025 జూలై 25న విడుదలవుతోంది.
కాగా హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ ఈ ప్రతిష్టాత్మక యానిమేటెడ్ ఫ్రాంచైజీ కోసం ఇటీవలే భారీ లైనప్‌ను అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇది ఒక దశాబ్ద కాలం పాటు కొనసాగుతుంది. విష్ణువు దశావతారాలను తెరపైకి ఆవిష్కరిస్తుంది. మహావతార్ నరసింహ (2025), మహావతార్ పరశురామ్ (2027), మహావతార్ రఘునందన్ (2029), మహావతార్ ధావకధేష్ (2031), మహావతార్ గోకులానంద (2033), మహావతార్ కల్కి పార్ట్ 1 (2035), మహావతార్ కల్కి పార్ట్ 2 (2037) రాబోతున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























