గత ఏడాది క తో కెరీర్ లో సాలిడ్ హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ సమ్మర్ లో దిల్ రుబా తో వచ్చి పరాజయాన్ని చవిచుశాడు.ఇక ఈహీరో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో కె – ర్యాంప్ ఒకటి.కేరళ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా రానుంది.ఇందులో కిరణ్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడు.ఇక ఈసినిమా నిన్నటితో కేరళ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.ఈ సందర్భంగా చిన్న సెలబ్రేషన్ డాన్స్ వీడియో ను రిలీజ్ చేశారు. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొత్త దర్శకుడు జైన్స్ నాని ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యుక్తి థరేజా హీరోయిన్ గా నటిస్తుంది. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.సామజవరగమన నిర్మాత రాకేష్ దండా నిర్మిస్తున్నారు. దీపావళికి రిలీజ్ కానుంది. మరి ఈసినిమాతో కిరణ్ మళ్ళీ ఫామ్ లోకి వస్తాడో చూడాలి.
ఇక కిరణ్ ప్రస్తుతం ఈసినిమా తోపాటు చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా కూడా చేస్తున్నాడు. చెన్నై బ్యాక్ డ్రాప్ లో ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతుంది. మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియా ఇందులో హీరోయిన్ నటిస్తుండగా లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.బేబి డైరెక్టర్ సాయి రాజేష్ ఈసినిమాను నిర్మిస్తున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























