కింగ్డమ్ రిలీజ్ డేట్ ఆ రోజే రానుంది

Kingdom release date announcement coming out on Monday

యంగ్ హీరో విజయ్ దేవరకొండ మచ్ మచ్ అవైటెడ్ మూవీ కింగ్డమ్ రిలీజ్ డేట్ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 30నే రిలీజ్ కావాల్సివుండగా వాయిదా పడింది.ఆ తరువాత జూలై 4న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.ఇక ఆ డేట్ కూడా మిస్ అయ్యింది. ఆ డేట్ కి సినిమా రెడీ కాకపోవడంతో మరోసారి వాయిదా పడింది.ఆ తరువాత రిలీజ్ డేట్ ఇవేనంట్లు పలు తేదీలు తెర మీదకు వచ్చాయి.అయితే మేకర్స్ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఫైనల్ గా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారట. సోమవారం ఈ డేట్ ను ప్రకటించనున్నారని సమాచారం.సో మరో రెండు రోజుల్లో రిలీజ్ డేట్ తెలిసిపోనుంది.ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మార్చే ప్రసక్తే లేదట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈసినిమాను తెరకెక్కిస్తుండగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఇప్పటివరకు గ్లింప్స్ ,ఓ సాంగ్ మాత్రమే రిలీజ్ అయ్యాయి.రిలీజ్ డేట్ ప్రకటించాక ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.పాన్ ఇండియా మూవీ గా రానున్న ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.

ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాడు.అందులో ఓ సినిమాను రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా తో చేయనుండగా దిల్ రాజు నిర్మించనున్నారు.ఆగస్టు నుండి షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు.

అలాగే టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ తో ఓ కూడా విజయ్ సినిమా చేయనున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఇది కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.విజయ్ ఈరెండు సినిమాలను బ్యాలన్స్ చేయనున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.