జూనియర్ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

Junior Second Single Viral Vayyari Released

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్’. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే కన్నడ సినిమా ఐకాన్, క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్రన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైననర్‌గా రూపొందుతున్న ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ ఇటీవలే ఫస్ట్ సింగిల్ ‘లెట్స్ లివ్ దిస్ మోమెంట్’ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. అలాగే ఆ తర్వాత విడుదల చేసిన టీజర్ కూడా అలరించింది.

ఇప్పుడు ఈ జోరుని మరింత పెంచుతూ జూనియర్ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘వైరల్ వయ్యారి’ అంటూ సాగే ఈ పాటకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మాస్ ఎనర్జీతో నిండిన కంపోజిషన్ ఇచ్చారు. సాంగ్ అదిరిపోయింది. DSP, హరిప్రియ ఇద్దరూ పాడిన స్టైల్ సాంగ్‌ని ఇంకో లెవల్‌కి తీసుకెళ్లింది. లిరిక్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి కూడా సూపర్ మోడర్న్ టచ్ ఇచ్చారు.

యూత్‌తో కనెక్ట్ అయ్యేలా సోషల్ మీడియా లాంగ్వేజ్, ట్రెండీ ఫ్రేసెస్ తో హైలైట్ అయింది. కిరీటి రెడ్డి, శ్రీలీల కలిసి డాన్స్ అదరగొట్టారు. కిరీటి స్టెప్పుల్లో గ్రేస్ చూపిస్తే, శ్రీలీల త‌న అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌, ఎలిగెన్స్‌తో ఆకట్టుకుంది. అందమైన సెట్స్‌లో షూట్ చేసిన వైరల్ వయ్యారి పాట క్యాచి మ్యూజిక్, ట్రెండీ లిరిక్స్, కలర్ ఫుల్ విజువల్స్ తో ఈ సాంగ్ ఈ ఏడాది వైరల్ చార్ట్‌బస్టర్ హిట్ కానుంది.

ఈ సినిమాకి కె.కె. సెంథిల్ కుమార్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ, నిరంజన్ దేవరమనే ఎడిటర్. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని డైలాగ్ అందిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.