దిల్ రాజు డ్రీమ్స్.. లక్షలాది మందికి ఒక హోప్‌ని ఇచ్చింది

Vijay Deverakonda Praises Producer Dil Raju For Launching Dil Raju Dreams

కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ సహా ఇండస్ట్రీలోకి రావాలనుకునే అందరికీ సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘దిల్ రాజు డ్రీమ్స్’ పేరుతో సరికొత్త వెబ్‌సైట్‌ని స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కార్యక్రమంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ముఖ్య అతిధులుగా హాజరై వెబ్‌సైట్‌ని లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా దిల్ రాజు డ్రీమ్స్ లాంచింగ్ ఈవెంట్‌లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. 13 ఏళ్ల క్రితం పొద్దున లేచిన వెంటనే idlebrain డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసే వాడిని. ఎక్కడైనా కాస్టింగ్ కాల్స్ ఉన్నాయా అని చెక్ చేసుకునే వాడిని. ఆ రోజుల్లో ఇంత ఇంటర్నెట్, సోషల్ మీడియా లేదు. శేఖర్ కమ్ముల గారి ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా కాస్టింగ్ కాల్ అందులో చూడడం నాకు ఇంకా గుర్తుంది.”

“చూసిన వెంటనే దానికి అప్లై చేశాను. దాదాపు 6 నెలలు టెన్షన్ పడ్డాను. ఆ టెన్షన్ కూడా ఒక తృప్తిని ఇచ్చేది. ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఆపర్చ్యూనిటీ ఉందనే ఆనందం ఉండేది. 16 వేల అప్లికేషన్స్ ఆ సినిమాకి వచ్చాయి. 11 మందిని సెలెక్ట్ చేశారు. అందులో నేను ఉన్నాను. ఆ సినిమా నా జీవితంలో పెద్ద రోల్‌ని ప్లే చేసింది. ఒక అవకాశం ఎంత గొప్పదో నాకు తెలుసు.”

“దిల్ రాజు డ్రీమ్స్ ని దిల్ రాజు గారికి ఎందుకు లాంచ్ చేయాలని అనిపించిందో నాకు తెలియదు, కానీ ఇది లక్షలాది మందికి ఒక హోప్ ని ఇచ్చింది. ఆపర్చ్యూనిటీ గురించి చూస్తున్న ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విషెస్. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆఫ్ లక్. ఇందులో ఒక్కరి కల నెరవేరినా ఈ వెబ్‌సైట్‌ లాంచ్ చేయడానికి న్యాయం జరిగినట్టే. దిల్ రాజు గారు 14 మంది డైరెక్టర్స్‌ని లాంచ్ చేశారు.”

“ఇప్పుడు ఈ వేదిక ద్వారా నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్‌ని లాంచ్ చేయబోతున్నారు. ఐదేళ్ల తర్వాత మీలో కూడా ఎవరో ఒకరు ఇలా స్టేజ్ మీద నిలబడి దిల్ రాజు డ్రీమ్స్ రా తమ డ్రీమ్‌ని నెరవేర్చుకున్నామని చెప్తే చాలా ఆనంద పడతాను. ఇంత అద్భుతమైన ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసిన దిల్ రాజు గారికి అభినందనలు. అందరికీ థాంక్యూ” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.