ఆంధ్రా కింగ్ తాలూకా కొత్త షెడ్యూల్ అప్‌డేట్

Andhra King Taluka New Schedule Begins in Rajahmundry

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా షూటింగ్ షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామ్ పోతినేని, కన్నడ స్టార్ ఉపేంద్రలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఆసక్తికరమైన కథాంశంలో రామ్ డై హార్డ్ అభిమాని పాత్రను పోషిస్తుండగా, ఉపేంద్ర సూపర్ స్టార్‌గా పాత్రలో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టైటిల్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

టాప్ టెక్నిషియన్స్‌తో ఈ ప్రాజెక్ట్ అత్యున్నత స్థాయి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది. కాగా ఇందులో లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే రామ్ సరసన కథానాయికగా నటిస్తుండగా.. రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సిద్ధార్థ నుని సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుండగా.. వివేక్-మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహిస్తున్నారు. హరీష్ తుమ్మల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ట్యాలెంటెడ్ స్టార్ కాస్ట్, అద్భుతమైన కథాంశం, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఒక అద్భుతమైన ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.