కన్నప్పకి అంతటా పాజిటివ్ టాక్, భారీగా బుకింగ్స్

Kannappa Holds Strong Bookings By Generating Positive Buzz on First day

విష్ణు మంచు హీరోగా టైటిల్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో అన్ని ప్రధాన భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. భక్తిరస ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీపై తొలినుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. విడుదలకు ముందే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం కూడా దీనికి ప్రధాన కారణం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే కన్నప్పకి మార్నింగ్ షో నుంచే విడుదలైన ప్రతిచోటా పాజిటివ్ టాక్ వస్తోంది. ఓవర్సీస్‌లో కూడా సినిమాకి మంచి రివ్యూలే వస్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా కన్నప్ప మూవీ చాలా బావుందంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ అద్భుతంగా ఉందని మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. దీంతో ఈ సినిమాని వీక్షించేందుకు మూవీ లవర్స్ థియటర్లకు పరుగులు తీస్తున్నారు.

ఈ కారణంగా బుక్ మై షో లో బుకింగ్స్ గంటగంటకూ పెరుగుతున్నాయి. మరోవైపు మంచు ఫ్యాన్సే కాకుండా ప్రభాస్ అభిమానులు కూడా కన్నప్ప థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. మరోవైపు హిందీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ రావడం.. రేపు, ఎల్లుండి వీకెండ్ కావడంతో ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు అందుకోవచ్చని సినిమా పండితులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే, విష్ణు మంచికి చాలారోజుల తర్వాత సాలిడ్ హిట్ పడినట్టే.

కాగా కన్నప్ప సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపించగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ‘రుద్ర’ అనే ప్రత్యేక పాత్రలో మెరిశారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించగా.. మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే మంచు ఫ్యామిలీ మూడోతరం వారసులు అరియానా, వివియానా, మాస్టర్ అవ్రామ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.

ఇక కన్నప్ప చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు, ‘రామాయణ్, మహాభారత్’ వంటి పౌరాణిక మరియు ‘తెనాలి రామ, మేరే సాయి’ వంటి భక్తి రస సీరియల్స్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూర్చారు. డీఓపీ షెల్డన్ చౌ సినిమాటోగ్ర‌ఫీ అందించగా.. ఆంథోనీ ఎడిటింగ్ నిర్వహించారు. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.