రష్మిక కొత్త సినిమా అప్‌డేట్

Rashmika Mandanna New Film Update

ఇండియన్ సినిమాలో ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం రష్మిక మందన్నయే. నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ గత కొన్నేళ్లుగా సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో కీలక భూమిక పోషించింది. వందల కోట్లు కలెక్ట్ చేసిన ‘యానిమల్, పుష్ప 2, ఛావా’ వంటి పాన్ ఇండియన్ మూవీస్‌తో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఇక ఇటీవల వచ్చిన ‘కుబేర’ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది రష్మిక.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో తాజాగా ఆమె కథానాయికగా కొత్త సినిమా ఒకటి ప్రారంభమవుతోంది. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి రేపు కీలక అప్‌డేట్ రానుంది. ఈ మూవీ టైటిల్ రివీల్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక సోషల్ మీడియాలో అభిమానులను ఉద్దేశించి.. “నా తదుపరి టైటిల్ ఏమిటో మీరు ఊహించగలరా? ఎవరూ నిజంగా ఊహించలేరని నేను అనుకుంటున్నాను.. కానీ మీరు ఊహించగలిగితే నేను మిమ్మల్ని కలవడానికి వస్తానని మాట ఇస్తున్నాను.” అని పేర్కొంది.

ఇక ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రష్మిక ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ఉత్కంఠభరితమైన, అద్భుతమైన అవతార్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేసింది. ఈ పోస్టర్ రష్మికను ఈటెను పట్టుకున్న శక్తివంతమైన వనిత పాత్రలో కొత్త లుక్‌లో ఆవిష్కరించింది. ఇక ఈ ఫస్ట్ లుక్‌ పోస్టర్ సినిమా ప్రారంభించక మునుపే అంచనాలను పెంచేదిగావుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.