‘అనగనగా’ సినిమాపై మహేష్ బాబు స్పెషల్ రివ్యూ

Superstar Mahesh Babu Special Review on Sumanth's Anaganaga Movie

టాలీవుడ్ సీనియర్ హీరో సుమంత్ కథానాయకుడిగా నటించిన లాటెట్స్ మూవీ ‘అనగనగా’ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ETV విన్ వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది. పిల్లల పెంపకం, చదువులు, ఈ విషయాల్లో తల్లిదండ్రుల బాధ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులు వంటి సున్నితమైన అంశాలను ఈ సినిమా చాలా చక్కగా తెరపై చూపించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో ప్రతి ఒక్కరూ ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. ఈ క్రమంలో పాజిటివ్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాను వీక్షించిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా మూవీ మరియు చిత్ర యూనిట్‌ను అభినందించారు.

ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. “అనగనగా సినిమా చాలా సరళమైన మరియు భావోద్వేగభరితమైన కథ, అందంగా చెప్పబడింది.. నిజంగా మీ సమయాన్ని వెచ్చించాల్సిన సినిమా! సుమంత్ మరియు చిత్ర బృందం అందరూ చాలా గొప్ప పని చేశారు. మీ అందరికీ నా ప్రేమను తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఇంత‌టి విజ‌యం సాధించినందుకు చిత్ర‌యూనిట్‌కి నా శుభాకాంక్ష‌లు” అని పేర్కొన్నారు.

కాగా అనగనగా చిత్రానికి సన్నీ సంజయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా.. రాకేశ్‌ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో కాజల్‌ చౌదరి కథానాయికగా న‌టించగా.. మాస్టర్ విహార్ష్, అవ‌స‌రాల‌ శ్రీనివాస్, అను హాసన్, రాకేష్ రాసకొండ, P.V.S రవి, కముడి నేమాని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.