మెగా 157 థర్డ్ షెడ్యూల్ అప్డేట్

Mega 157's third schedule shoot starts in the first week of July

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి- మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో మెగా 157 (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.రీసెంట్ గానే ఈసినిమా సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ , సెకండ్ షెడ్యూల్ రషెస్ చూసి చిరు ఫుల్ శాటిస్ఫై అయ్యారట.ఇక థర్డ్ షెడ్యూల్ జూలై మొదటి వారంలో స్టార్ట్ కానుంది. హైదరాబాద్ ,కేరళ లో ఈ షెడ్యూల్ జరగనుంది.దీంతో 40శాతం షూటింగ్ కంప్లీట్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంక్రాంతికి వస్తున్నాంలాగే ఈసినిమాను కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి.అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో చిరు సరసన నయనతార నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.షైన్ స్క్రీన్స్ ,గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై సాహు గారపాటి ,సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.సంక్రాంతి కానుకగా ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఇక ఈసినిమా కన్నా ముందు చిరంజీవి ,విశ్వంభరతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేసుకుంటుంది.ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా బ్యాలెన్స్ వుంది.అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ కూడా పూర్తి కావాల్సివుంది.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.