విష్ణు మంచు హీరోగా తెరకెక్కిన ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ‘రుద్ర’ అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూర్చారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ జూన్ 27న అన్ని ప్రధాన భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో కన్నప్ప టీమ్ తాజాగా ఓపెన్ లెటర్ రిలీజ్ చేసింది. ఈ సినిమా గురించి ఎవరైనా తప్పుడు వార్తలు సృష్టించినా, లేదా ప్రచారం చేసినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా.. “ప్రజలకు గమనిక.. మా చిత్రం కన్నప్ప జూన్ 27, 2025న ప్రపంచవ్యాప్తంగా పూర్తి చట్టబద్ధమైన అనుమతులతో విడుదల అవుతుంది. సినిమా లేదా దాని వాటాదారులపై దుర్వినియోగం, వక్రీకరణ లేదా పరువు నష్టం కలిగించే చర్యలు చట్టపరంగా సవాలు చేయబడతాయి.” అని పేర్కొంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























