చిరంజీవి గారు నా లక్కీ చార్మ్ – శేఖర్ కమ్ముల

sekhar kammula speech at kuberaa success meet

ధనుష్, కింగ్ నాగార్జున,రష్మిక మందన్న కుబేర బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. శేఖర్ కమ్ముల ఈసినిమాను డైరెక్ట్ చేయగా సునీల్ నారంగ్ ,పుస్కూర్ రామ్ మోహన్ నిర్మించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.ఇక ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతుండడంతో ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ నిన్న సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించారు.దీనికి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ఈవెంట్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..చిరంజీవి గారు నా లక్కీ చార్మ్.ఆయన వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కాలేజ్ డేస్ లో ఆయనని కలిసాను. షేక్ హ్యాండ్ ఇచ్చాను ఆయన్ని డైరెక్ట్ చేస్తానని చెప్పాను.అప్పటి నుంచి మొదలైన జర్నీ 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది.ఈ సందర్భంగా ఆయన్ని మొన్న కలిసాను.అక్కడి నుంచి ఈ సినిమాకి ఒక యుఫోరియా స్టార్ట్ అయింది.చిరంజీవి గారు ఎప్పుడు కూడా బయట వ్యక్తిలా అనిపించరు. కుబేరకి ఆడియన్స్ ఇచ్చిన స్థానాన్ని స్థాయిని మర్చిపోలేను.ఈ సినిమాని గొప్పగా ఆదరించిన ప్రపంచవ్యాప్త ప్రేక్షకులందరికీ థాంక్యూ. ఒక ఫిలిం మేకర్ కి గొప్ప బలాన్ని ఇచ్చారు. ఈసినిమాకి అద్భుతమైన ప్రశంసలు అందించిన మీడియా కి ధన్యవాదాలు. చాలా పెద్ద కాన్వాస్ లో తీసిన సినిమా ఇది. ఈ సినిమాల్లో దీపక్ పాత్రని ఒప్పుకున్న నాగార్జున గారికి ధన్యవాదాలు ఆయన పెర్ఫార్మన్స్ కి థియేటర్స్ లో వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఆయన పర్ఫామెన్స్ ని చూస్తున్నప్పుడు నాకే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ధనుష్ గారి గురించి ఒకటే మాట చెప్పాలి.గాడ్ లైక్ పెర్ఫార్మెన్స్.పోయిరా మామ సాంగ్ చూసి నాకే పూనకాలు వచ్చాయి.మా అమ్మగారు ఈ సినిమాను చూసి ఇంకో పది నిమిషాలు ఉంటే బాగుండేది.

దేవ, దీపక్ చాలా అద్భుతంగా చేశారని చెప్పింది. రష్మిక, సమీరా పాత్రలో అద్భుతంగా పెర్ఫాం చేసింది.దేవి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి తెలుగు ,తమిళ్ రెండు భాషల్లో షూట్ చేశాం . అలా రెండు భాషల్లో రీ రికార్డింగ్ చేయడం పాటలు చేయడం అనేది మామూలు విషయం కాదు. డిఓపి నికేత్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.ఈసినిమాని ఫస్ట్ సైన్ చేసింది నారాయణ్ దాస్ గారు. ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మా మీద ఉంటాయి. సునీల్ గారికి రామ్మోహన్ గారికి జాహ్నవి గారికి థాంక్యూ.ఎంత బడ్జెట్ అయినా మాకు సపోర్ట్ ఇచ్చారు. వారి వలన ఇది పాజిబుల్ అయింది. మా అమిగోస్ టీం కి థాంక్యూ. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి పేరుపేరునా ధన్యవాదాలు అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.