విజనరీ ఫిల్మ్ మేకర్ మరియు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన విజయ్ మిల్టన్ ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహిస్తున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం రోజుకో కొత్త అప్డేట్ తో అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. రఫ్ నోట్ ప్రొడక్షన్ రూపొందిస్తోన్న ఈ డైనమిక్ లైనప్‌లో నటీనటుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఇద్దరి చేరికలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తన శక్తివంతమైన వ్యక్తిత్వంతో ప్రేక్షకులను ఆకర్షించిన బిగ్ బాస్ తమిళ సంచలనం జెఫ్రీ మరియు ‘గోలి సోడా’ సిరీస్ నుండి అద్భుతమైన ప్రతిభ కలిగిన భరత్ శ్రీని ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. జెఫ్రీ తన శక్తివంతమైన స్క్రీన్ ప్రజెన్స్ మరియు మాస్ అప్పీల్‌ను ఉపయోగించుకునేలా రూపొందించిన పాత్రలో కనిపించనున్నాడు.
రియాలిటీ షో నుండి బిగ్ స్క్రీన్ కి ప్రమోట్ అవడం అతనిలోని ఒక బోల్డ్ కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. కాగా ఇందులో అతని పాత్ర వినోదాత్మకంగా మరియు ప్రభావవంతంగా ఉంటుందని హామీ ఇస్తుంది. ఇక గోలి సోడాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న భరత్ శ్రీని, ఇందులో మరో అద్భుతమైన పాత్రను పోషించడానికి విజయ్ మిల్టన్‌తో తిరిగి కలుస్తున్నాడు. అతని చేరిక సినిమాకి బలం కానుంది.
ఇటీవలే, ‘అసురన్, రాట్చసన్’ చిత్రాలలో శక్తివంతమైన పాత్రలు పోషించిన అమ్ము అభిరామి, మిల్టన్ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో.. ఇప్పుడు ఈ ఇద్దరు నటులను టీమ్ స్వాగతించింది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మిల్టన్ వారిని ప్రశంసిస్తూ.. “వారు నటించరు – పాత్రలలో జీవిస్తారు” అని అన్నారు.
ఆరి ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పోలీసు పాత్రను పోషించడం, రాజ్ తరుణ్ తమిళంలో అరంగేట్రం చేయడం, భరత్ మరియు పాల్, అలాగే ఇంకా సునీల్ వంటి తారాగణంతో ఈ సినిమాకి పాన్-ఇండియన్ ఆకర్షణను తీసుకువచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరికి తోడుగా ఇప్పుడు జెఫ్రీ మరియు భరత్ శ్రీని చేరికతో – జెఫ్రీ మరియు భరత్ శ్రీని చేరికతో తారాగణం అద్భుతంగా ఉంది.
విజయ్ మిల్టన్ ఈ కథను తన ట్రేడ్‌మార్క్‌తో అద్భుతంగా మలచబోతున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ కి జూలై 7న అధికారికంగా టైటిల్ ప్రకటించనున్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























