హీరో ఆది సాయి కుమార్ చాలా రోజుల నుండి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.ప్రేమకావాలితో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరో ఆతరువాత మరోసారి అలాంటి విజయాన్ని అందుకోలేకపోయాడు.ప్రస్తుతం ఆది చేతిలో రెండు సినిమాలు వున్నాయి.అందులో సబ్-ఇన్ స్పెక్టర్ యుగంధర్ ఒకటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెట్స్ మీద వున్నప్పుడే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయ్యింది.అందులో భాగంగా ఈటీవీ విన్ ఓటీటీ హక్కులను దక్కించుకోగా ప్రముఖ ఛానెల్ శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకుంది.అలా రిలీజ్ కు ముందే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది.ఇక నిన్నటితో ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.సినిమా కూడా బాగా వచ్చిందని టాక్.మరి సబ్-ఇన్ స్పెక్టర్ యుగంధర్ తో ఆది కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకు పెద్దగా అప్డేట్స్ ఏమి బయటికి రాలేదు.అయితే ఇప్పుడు షూటింగ్ కూడా కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.ఆగస్టు లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక ఆది సాయి కుమార్ ప్రస్తుతం శంబాల అనే సినిమా కూడా చేస్తున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా టీజర్ రాగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.యుగంధర్ ముని ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అర్చన అయ్యర్ ,స్వసికా ,మధు నందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా మహీధర్ రెడ్డి , రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు.ఇది కూడా ఈఏడాదే రిలీజ్ అయ్యే ఛాన్స్ వుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























