తమిళ స్టార్ హీరో విజయ్ చివరి సినిమాగా వస్తుంది జన నాయగన్.ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు విజయ్.ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది.అయితే ఈసినిమాకు సంబంధించి ఇప్పటివరకు విజయ్ పోస్టర్లు మాత్రమే రిలీజ్ చేశారు.ఇక ఈసినిమా నుండి విజయ్ బర్త్ డే రోజున గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు.ఈనెల 22న అర్ధరాత్రి 12గంటలకు ఈ గ్లింప్స్ రిలీజ్ చేసి విజయ్ కి బర్త్ డే విషెష్ చెప్పనుంది జన నాయగన్ టీం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా బాబీ డియోల్,ప్రకాష్ రాజ్,గౌతమ్ మీనన్ ,నరైన్,ప్రియమణి,మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.కె వి ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తుంది.జనవరి 9న ఈసినిమా రిలీజ్ కానుంది.అయితే అదే రోజు తెలుగులోకూడా రిలీజ్ చేస్తే ఈసినిమా భారీ పోటీ ఎదురుకోవాల్సి ఉంటుంది.ఎందుకంటే సంక్రాంతి టార్గెట్ గా తెలుగు నుండి భారీ సినిమాలు రాబోతున్నాయి.ఈనేపథ్యంలో జన నాయగన్ ను తెలుగులో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.
ఇక విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు.ఇప్పటికే విజయ్ సొంతంగా పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే.వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ని బరిలోకి దింపనున్నాడు.దాంతో విజయ్ సినిమాలు ఆపేసి ఫుల్ టైం పొలిటీషియన్ గా బిజీ కానున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























