ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ మూవీలో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన సూపర్ స్టార్ సూర్యకుమార్ అనే పాత్రలో కనిపించనున్నారు.
ఇటివలే రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యుమినియం ఫాక్టరీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో రామ్, ఉపేంద్ర పాల్గొంటున్నారు. కీలక టాకీ పార్ట్ షూట్ చేస్తున్నారు. రామ్, ఉపేంద్ర కాంబినేషన్‌లో వచ్చే ఈ సీన్స్ సినిమాలో మేజర్ హైలెట్‌గా ఉండబోతున్నాయి.
కాగా ఈ సినిమాలో రామ్ ఇప్పటివరకు చేయని ఒక యూనిక్ క్యారెక్టర్‌ని చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అద్భుతమైన తారాగణం నటిస్తోంది. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కాగా దర్శకుడు మహేష్ బాబు పి ఈ సినిమా కోసం యూనిక్ కథని రాశారు. ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా భారీ అంచనాలని పెంచుతోంది. మొత్తానికి ఆడియన్స్‌కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించబోతోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సిద్ధార్థ నూని, మ్యూజిక్ వివేక్–మర్విన్. జాతీయ అవార్డు విజేత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























