మ్యాడ్ ఫేమ్ అనంతికా సనీల్‌కుమార్ లీడ్ రోల్ లో మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ చేసిన సినిమా 8 వసంతాలు.ఈసినిమా నుండి ఇంతకుముందు రెండు టీజర్లు ,సాంగ్స్ రిలీజ్ కాగా వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈరోజు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా ఇందులో డైలాగ్స్ బాగున్నాయి.తండ్రి చేతే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతూ, ఆనందం, ప్రేమ, విషాదం లాంటి అనుభూతులతో అనంతిక ప్రయాణం సాగుతుంది. ప్రతి వసంతం ఒక కీలక మలుపు.ఆమె కొన్ని విధానాలను ఎదిరించే ధైర్యవంతురాలిగా మారడాన్ని ట్రైలర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది.
అనంతికా సనీల్‌కుమార్ తన పాత్రలో చాలా బాగా ఒదిగిపోయింది.ఆమె క్యారెక్టర్ లో ఎమోషన్స్ ని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు.ఒక మటన్ షాప్‌లో జరిగే యాక్షన్ సీన్ ఆమె ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుంది.హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల ముఖ్య పాత్రలలో ఆకట్టుకున్నారు.హెషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.ఈనెల 20న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అయితే అదే రోజు కుబేర కూడా రిలీజ్ కానుండడంతో 8 వసంతాలకు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























