ఉస్తాద్ భగత్ సింగ్ షూట్‌లో పవన్ కళ్యాణ్

Power Star Pawan Kalyan Joins Ustaad Bhagat Singh Shoot

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే అనుకోని కారణాలతో మొదలైన కొన్నిరోజులకే ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇతర సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ అప్పుడప్పుడూ బయటకు వస్తున్నా, ఈ సినిమా నుంచి మాత్రం ఎలాంటి అప్‌డేట్ రాలేదు. మధ్యలో ఒకటి, రెండు సార్లు చిన్న చిన్న అప్‌డేట్స్ ఇచ్చింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించింది చిత్ర యూనిట్.

ఈరోజు ఈ మూవీ షూటింగ్ పునఃప్రారంభం అయింది. హైదరాబాద్‌లో ఈ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ అఫీషియల్ గా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సెట్స్‌ లో జోష్ నెలకొంది. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి నిజంగా శుభవార్తే.

ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఆయనంక బోస్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. అలాగే ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనింగ్, రామ్-లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ప్రొడ్యూసర్స్ యలమంచిలి రవిశంకర్, నవీన్ యెర్నేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.