తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుముశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన తాజాగా గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, పిల్లలు ఉండగా, గత కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి కార్డియాక్ అరెస్ట్ కారణంగా రవికుమార్ చౌదరి తుదిశ్వాస విడిచినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన ‘యజ్ఞం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన, తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత స్టార్ హీరో నందమూరి బాలకృష్ణతో ‘వీరభద్ర’, సాయి ధరమ్ తేజ్‌తో ‘పిల్లా నువ్వు లేని జీవితం’, గోపిచంద్‌తో రెండో సారి ‘సౌఖ్యం’, నితిన్‌తో ‘ఆటాడిస్తా’ వంటి సినిమాలతో దర్శకుడితో గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఏఎస్ రవి కుమార్ చివరిగా యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో ‘తిరగబడరా సామి’ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























