వేల కోట్ల సినిమాలు మేము కూడా చేయలేకపోయాం, కానీ రష్మిక.. నాగార్జున

Rashmika Mandanna is A Power House of Talent, Says Nagarjuna at Kuberaa Press Meet

రష్మిక మందన్న ఒక ట్యాలెంటెడ్ పవర్ హౌస్ అని పేర్కొన్నారు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున. ఈ మేరకు ఆయన ఈరోజు ముంబై వేదికగా జరిగిన ‘కుబేర’ మూవీ ప్రెస్ మీట్‌లో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన్న జంటగా నటించగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున ఒక కీలక పాత్రను పోషించారు. జూన్ 20న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా విడుదలకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రిలీజ్ డేట్ దగ్గర పడిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మురం చేసింది. ఈ క్రమంలో నేడు ముంబైలో ప్రెస్ మీట్ ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా హీరో నాగార్జున మాట్లాడుతూ.. ‘రష్మిక మందన్న నిజంగా ఒక ట్యాలెంటెడ్ పవర్ హౌస్. మాకెవరికీ సాధ్యపడని రికార్డులను ఆమె అవలీలగా అందుకుంది. 2,000 లేదా 3,000 కోట్ల సినిమాలు మేము ఎవరమూ తీయలేకపోయాం. కానీ రష్మిక మాత్రం ఆ ఫీట్ అందుకుంది” అని ప్రశంసలు కురిపించారు. దీంతో రష్మిక సిగ్గుపడుతూ నాగ్‌కి థాంక్స్ చెప్పింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.