కన్నప్ప ట్రైలర్ రానుంది

The trailer of Kannappa arrives On 13th June

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప మరో 17 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.దాంతో ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు.ఇప్పటికే ఈసినిమాకు భారీ హైప్ వచ్చింది. సాంగ్స్ అయితే సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఈసినిమా నుండి కీలకమైన ట్రైలర్ రానుంది.ఈనెల 13న ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది.ట్రైలర్ రిలీజైయ్యాక సినిమాపై అంచనాలు డబుల్ అవ్వడం ఖాయం.ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ లెవెల్లో జరుగుతుంది.ప్రముఖ నిర్మాతలు ఈసినిమాను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు.అందులో భాగంగా కేరళలో ఈసినిమాను మలయాళ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ ఆశీర్వాద్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే మిగితా భాషల్లో కూడా బడా నిర్మాతలు థియేట్రికల్ హక్కులు దక్కించుకున్నారు.దాంతో కన్నప్ప గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ముఖేష్ కుమార్ సింగ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా మంచు విష్ణు ,మోహన్ బాబు ,రెబల్ స్టార్ ప్రభాస్ ,మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు.ఇందులో ప్రభాస్ పాత్ర ఎలావుండనుందో నని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక సినిమాలో ప్రభాస్ దాదాపు 30 నిమిషాల సేపు కనిపించనున్నాడట.స్టార్ పవర్ కి తోడు హిట్ టాక్ వస్తే కన్నప్ప భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.భారీ బడ్జెట్ తో మంచు విష్ణు ఈసినిమాను నిర్మించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.