మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనెలలో ఫస్ట్ మచ్ అవైటెడ్ మూవీ గా రానుంది కుబేర.ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఈనెల 20న రిలీజ్ కానుంది.ఇక ఈసినిమా కు షాకింగ్ రన్ టైం ను సెట్ చేశారు మేకర్స్.కుబేర తెలుగు వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా ఈ సెన్సార్ సర్టిఫికెట్ బయటకు వచ్చేసింది.ఇందులో యు/ఏ సర్టిఫికెట్ తో 3 గంటల 15 నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుందని వుంది.
ఇంత లెంగ్తీ రన్ టైంతో శేఖర్ కమ్ముల సినిమా తీయడం ఇదే మొదటి సారి.అలాగే రీసెంట్ గా యానిమల్ ,పుష్ప 2 ఇంచుమించు ఇదే రన్ టైంతో రాగా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.ఇక ఇప్పుడు కుబేర కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతుంది.మరి ఈసెంటిమెంట్ కుబేరకు కలిసొస్తుందోచూడలి.
ఇక ప్రమోషన్స్ లో భాగంగా రేపు ముంబైలో ఈవెంట్ జరుగనుంది.దీనికి చిత్ర బృందం హాజరుకానుంది.ఇందులో సినిమాలోని థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.100 కోట్లకుపైగా బడ్జెట్ తో రూపొందిన ఈసినిమా సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది.ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటించిన ఈసినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి,అమిగోస్ క్రియేషన్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























