మచ్ అవైటెడ్ కన్నప్ప రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్ర బృందం.అందులో భాగంగా రెండు రోజుల క్రితం గుంటూరులో భారీ ఈవెంట్ నిర్వహించారు.త్వరలోనే మరో ఈవెంట్ జరుగనుంది. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రిలీజ్ విషయానికి వస్తే మిగితా భాషల్లో కూడా బడా డిస్ట్రిబ్యూటర్లు దొరుకుతున్నారు.కేరళలో ఈసినిమాను మలయాళ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ ఆశీర్వాద్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది.దాంతో కన్నప్ప అక్కడ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.దీనికి తోడు ఈసినిమాలో మోహన్ లాల్ కూడా ఉండడం అడ్వాంటేజ్ కానుంది.త్వరలో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.మంచు విష్ణు ఈసినిమా కోసం భారీగా ఖర్చు పెట్టాడు.
ముఖేష్ కుమార్ సింగ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా మంచు విష్ణు ,మోహన్ బాబు ,రెబల్ స్టార్ ప్రభాస్ ,మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రల్లో నటించారు.ఇందులో ప్రభాస్ దాదాపు 30 నిమిషాల సేపు కనిపించనున్నాడు.ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఈనెల 27న కన్నప్ప థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























