యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఎప్పటి నుండో ఓ భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు.ప్రేమకావాలితో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన ఆది ఆ ఆతరువాత మాత్రం సరైన విజయం లేక రేస్ లో చాలా వెనకబడ్డాడు. అయితే ఈసారి రూటు మార్చి సాలిడ్ కంటెంట్ వున్న సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం ఆది ,శంబాలా అనే సినిమా లో నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా టీజర్ ఈరోజే రిలీజ్ చేశారు. టీజర్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది.టీజర్ లోనే స్టోరీ రివీల్ చేశారు.ఓ ఊరిలో ఆకాశం నుండి ఉల్క ఊడిపడడం దాని ప్రభావం తో ఆ ఊరు లోని జనాలు చనిపోవడం, ఈ సమస్యను పరిష్కరించడానికి హీరో ఆ ఊళ్ళో అడుగుపెట్టడం, ఆ తరువాత ఏమైంది ఇదే శంబాల కథ.విజువల్స్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయాయి.
టీజర్ చూసిన వారు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.ఈసినిమా ఆది సాయి కుమార్ కి కం బ్యాక్ అవుతుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.యుగంధర్ ముని ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అర్చన అయ్యర్ ,స్వసికా ,మధు నందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా మహీధర్ రెడ్డి , రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు.త్వరలోనే ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఇక ఆది సాయి కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.ఈసినిమా కూడా ఈఏడాదే రిలీజ్ కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























