మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సౌత్ టాప్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ జీ స్క్వాడ్ అనే బ్యానర్ ను స్థాపించి నిర్మాతగా మారాడు. లోకేష్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా బెంజ్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఓ పార్ట్ గా వస్తున్న ఈసినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు.ఇక ఈసినిమా కు విలన్ గా మలయాళం హీరో నివిన్ పౌలీని తీసుకున్నారు.ఇందులో నివిన్,వాల్టర్ గా కనిపించనున్నాడు.నిన్న ఈ పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.ఇందులో నివిన్ గెటప్ విక్రమ్ లో రోలెక్స్ పాత్రను గుర్తుచేసింది.ఇక వాల్టర్ పాత్ర అయితే చాలా వైలెంట్ గా ఉండనుంది.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుండగా ఈఏడాది చివర్లో విడుదలచేయాలని చూస్తున్నారు.రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.తనకు ఇదే మొదటి సినిమా.జగదీష్ ,సుధాన్ సుందరం తో కలిసి లోకేష్ ఈసినిమాను నిర్మిస్తున్నాడు.
ఇక లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం కూలీని పూర్తి చేసే పనిలో వున్నాడు.ఈనెలలోపు సినిమాను రెడీ చేసి జూలై నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.సూపర్ స్టార్ రజనీకాంత్ ఇందులో హీరోగా నటించగా కింగ్ నాగార్జున పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు.దాంతో ఈసినిమాపై తెలుగులోకూడా భారీ అంచనాలు వున్నాయి. కూలీకి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఆగస్టు 14 న రిలీజ్ కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























