‘కేజీఎఫ్’ సిరీస్ మరియు ‘సలార్’ చిత్రాల ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సన్నిహితులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్‌కి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా.. “హ్యాపీ బర్త్ డే ప్రశాంత్. మాటల కంటే మీ విజన్ గొప్పది. తెరపై మరింత ఫైర్‌ని చూడాలని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘ఎన్టీఆర్-నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























