కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలివుడ్ కింగ్ నాగార్జున ప్రధానపాత్రల్లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కుబేర’. జూన్ 20న థియేటర్లలోకి వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, మీడియా, చిత్ర పరిశ్రమ నుండి ప్రముఖులు హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోలు ధనుష్, నాగార్జున, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు శేఖర్ కమ్ముల, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, నిర్మాతలు సునీల్ నారంగ్, జాన్వి నారంగ్, భరత్ నారంగ్, సిమ్రాన్ నారంగ్, సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి, ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి, లిరిక్ రైటర్స్ వివేక, చంద్రబోస్, నంద కిషోర్ పాల్గొన్నారు. వారందరూ ఈ సినిమా గురించి తమ ఉత్సాహాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా కుబేర స్టార్-స్టడెడ్ ఆడియో లాంచ్ ఈవెంట్లో హీరో ధనుష్ మాట్లాడుతూ.. “ఓం నమః శివాయ”. “ఇది కలికాలం, ద్వేషం, ప్రతికూలత, అసూయ వృద్ధి చెందే సమయం. చెడు మంచిపై విజయం సాధిస్తున్నట్లు అనిపిస్తుంది. శేఖర్ కమ్ముల గారు ప్యూర్ సోల్ వున్న వ్యక్తి. సినిమాకి ఎంతగానో సపోర్ట్ చేసిన నిర్మాతలు సునీల్, జాన్వి నారంగ్‌కు కృతజ్ఞతలు.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “తిరుపతిలో ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించి, బిచ్చగాడిగా నటించిన విజువల్ వెరీ మెమరబుల్. ఆ అనుభవం జీవితంలోని ముఖ్యమైన సత్యాలను గుర్తు చేసింది. బనారస్‌లోని రాంఝానా చిత్రీకరణ సమయంలో, చితుల మధ్య గడిపిన సమయంలో దురాశ, డబ్బు, ప్రాపంచిక సుఖాలు – అవి ఏమీ శాశ్వతం కాదని అర్ధమైయింది, స్వచ్ఛమైన మనసు ముఖ్యం. కుబేర దానిని తెలియజేస్తుంది. ఈ చిత్రం చూపే ఇంపాక్ట్ గురించి నాకు 2000% నమ్మకం ఉంది” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























