భైరవం.. మా కెరీర్ మోస్ట్ మెమొరబుల్ మూవీ

Manchu Manoj, Bellamkonda Sreenivas and Nara Rohith Attends Bhairavam Q & A Press Meet

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ బీభత్సం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పించారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకుని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ బీభత్సం ‘భైరవం’ క్యూ & ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మనోజ్ గారు సినిమాలో మీ వాయిస్, డిక్షన్ మోహన్ బాబు గారి సిమిలారిటీస్ కనిపించింది? ఇది కావాలని ట్రై చేశారా?

  • అది డీఎన్ఏ. ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన ఆస్తి. తొమ్మిదేళ్ల తర్వాత ప్రేక్షకులు ముందుకు వచ్చాను.
  • నన్ను ఎంతో గొప్పగా ఆదరించారు. ఈ సందర్భంగా ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
  • మా సినిమా స్టార్టింగ్ నుంచి మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మీడియాకి, సోషల్ మీడియాకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్‌కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
  • మీ అందరి సపోర్టు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను మళ్ళీ ఆశీర్వదించిన సినీ కళామతల్లికి నమస్కరిస్తున్నాను.
  • నేను చేసిన గజపతి క్యారెక్టర్‌కి చాలా డెప్త్ ఉంది. ఈ సినిమా కోసం డబ్బింగ్‌కి కష్టపడినంత ఏ సినిమాకి కష్టపడలేదు.
  • డైరెక్టర్ గారు చాలా పవర్ ఫుల్‌గా క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఈ సినిమాకి పేరు వచ్చిందంటే దానికి కారణం మా డైరెక్టర్ గారు.
  • మా కోస్టార్స్ . ముగ్గురు హీరోలకి సమానంగా పేరు వచ్చింది. ఈ క్రెడిట్ డైరెక్టర్ గారికి దక్కుతుంది.

విజయ్ గారు ముగ్గురు హీరోల్ని డీల్ చేయడం కష్టమనిపించిందా?

  • ముగ్గురు ముగ్గురిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. కథలో మూడు క్యారెక్టర్స్‌ని బ్యాలెన్స్ చేయడం కష్టం.
  • అందరు ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. దానికి చాలా వర్క్ చేశాం.
  • సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ముగ్గురు హీరోలకి ఇది అద్భుతమైన కం బ్యాక్ అని ఆడియన్స్ చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది.

సాయి గారు.. భైరవం సినిమా మీకు ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చింది?

  • ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఇలాంటి కథ దొరికినప్పుడే మన పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉంటుంది.
  • అలాంటి కథ భైరవంతో రావడం చాలా ఆనందాన్నిచ్చింది. ఇది నాకు ఇది నా కెరీర్ లో మోస్ట్ మెమొరబుల్ మూవీ.
  • ఈ సినిమా జనాల్లోకి వెళ్లిపోయింది. చూసిన ప్రతి ఆడియన్‌కి ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చింది. మా భైరవం థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా.
  • తప్పకుండా మీ దగ్గరలో ఉన్న ధియేటర్స్‌కి వెళ్లి మా సినిమాలు చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను.
  • మంచి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌ ఉన్న సినిమా ఇది. మంచి హై తో ఆడియన్స్ బయటకు వస్తారు.

రోహిత్ గారు.. ఈ సినిమాలో మీరు చాలా సెటిల్ గా యాక్ట్ చేశారు.. ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

  • ఈ సినిమాకి చాలా మంచి టీం కుదిరింది. విజయ్‌కి చాలా క్లారిటీ ఉంది. తనతో మాట్లాడి క్యారెక్టర్‌కి తగ్గట్టుగా చేయడం జరిగింది.
  • నిజానికి నేను ఇంత మాస్ క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. డైరెక్టర్ విజయ కారణంగానే అంతా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌ని ఇవ్వగలిగాను.
  • ఇప్పటివరకు సినిమా చూసిన ఆడియన్స్ అందరు కూడా చాలా మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.
  • ఇది థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చే సినిమా. మీరందరు కూడా థియేటర్స్ వెళ్లి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.

మనోజ్ గారు.. ఈ సినిమా కోసం మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి?

  • ఒక్కటని చెప్పలేను. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. చాలామంది ఇంతకాలం మిమ్మల్ని మిస్ అయ్యాను అని చెప్పడం చాలా ఎమోషనల్‌గా అనిపించింది.
  • నా ఇంట్రడక్షన్‌కి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అప్లోజ్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది.
  • అది చూసినప్పుడల్లా చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఇదంతా గాడ్ బ్లెస్సింగ్‌గా భావిస్తున్నాను.

రాధా మోహన్ గారు రీరిలీజ్ లు కొత్త సినిమాలపై ఎఫెక్ట్ చూపిస్తాయని భావిస్తున్నారా?

  • ఎఫెక్ట్ అన్నమాట కొంతవరకు కరెక్టే. కానీ ఏది మనం ఆపలేం. ఈ ట్రెండ్ ఏడాదిగా మొదలైంది. ఒకరు చేస్తున్నారని మరొకరు చేస్తున్నారు.
  • నేను కూడా ‘బెంగాల్ టైగర్’ మళ్ళీ రిలీజ్ చేస్తానేమో. ఎఫెక్ట్ అయితే ఉంటుంది కానీ అల్టిమేట్‌గా ఆడియన్స్ ఛాయిస్.
  • దీనిపై చాంబర్లో ఇంకా ఎలాంటి డిస్కషన్ జరగలేదు. అయితే శుక్రవారం కాకుండా సోమవారం చేసుకుంటే బాగుంటుందని ఆలోచన నాకు తట్టింది.
  • దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దీనిపై అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి .

సాయి గారు.. క్లైమాక్స్‌లో పూనకం యాక్షన్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు దానికోసం ఎలాంటి ప్రిపరేషన్ తీసుకున్నారు?

  • నాకు ఈ కథలో ఎక్సయిట్ చేసిన పాయింట్ అదే. నేను కూడా ఆ సీక్వెన్స్‌కి ద బెస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను.
  • పూనకం చేయడం అనేది వెరీ చాలెంజింగ్. కరెక్ట్ మీటర్‌ని పట్టుకోవడం టఫ్.
  • లక్కీగా నేను డైరెక్టర్ గారు కరెక్ట్ మీటర్ పట్టుకుని చేయడం జరిగింది.
  • దానికి ఆడియన్స్ నుంచి ఎంత మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది
  • ఈ సినిమాలో డైలాగ్ డెలివరీ కూడా కొత్తగా ట్రై చేసాం. దానికి ముందుగానే చాలా చక్కని ప్రిపరేషన్ ఉండేది.
  • రెండు మూడు రోజులు ముందుగానే ప్రాక్టీస్ చేసేవాడిని. అది వెరీ చాలెంజింగ్. చాలెంజ్‌గా తీసుకొని చేయడం జరిగింది.

అతిథి గారు.. ఈ సక్సెస్‌ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?

  • ఎంత మంచి టాలెంట్ టీంతో తెలుగు ఇండస్ట్రీలోకి రావడం చాలా ఆనందంగా ఉంది.
  • ఇంతకంటే బెటర్ డెబ్యూ మరొకటి ఉండదు. అందరికీ బిగ్ థాంక్స్. మా టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్.

రాధా మోహన్ గారు.. ముగ్గురు హీరోలతో సినిమా చేసి హిట్టు కొట్టారు ఎలా అనిపిస్తుంది?

  • నెక్స్ట్ టైం ఐదుగురు హీరోలతో చేయాలనిపిస్తుంది (నవ్వుతూ). నిజంగా ఇది వెరీ చాలెంజింగ్.
  • కంటెంట్ సబ్జెక్టు ఆర్టిస్టుల్ని డిమాండ్ చేస్తుంది. ముగ్గురు ఇంపార్టెన్స్ ఉన్న ఆర్టిస్టులు కావాలి.
  • మా హీరోలు అద్భుతంగా చేశారు. ఈ జర్నీలో మాకు చాలా సపోర్ట్ చేశారు.

రోహిత్ గారు.. చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపించారా?

  • సినిమా నిన్ననే రిలీజ్ అయింది.
  • కచ్చితంగా ఆయనకి ఇన్ ఫామ్ చేస్తాను.
  • ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చూస్తారు.

మనోజ్ గారు.. మీ దగ్గర నుంచి మళ్లీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాని ఆశించవచ్చా?

  • నెక్స్ట్ 90 ఎం.ఎల్ ఫేం శేఖర్ రెడ్డి గారి దర్శకత్వంలో సినిమా వస్తుంది.
  • అది హైలి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. టైటిల్ కూడా అదిరిపోయింది, త్వరలోనే అనౌన్స్ చేస్తాం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.