సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతరు ఐశ్వర్య డైరెక్షన్ లో వచ్చిన సినిమా లాల్ సలామ్.ఇందులో రజినీ కూడా ఓ స్పెషల్ రోల్ చేశాడు.అయితే గత ఏడాది విడుదలైన ఈసినిమా అంచనాలను అందుకోలేకపోయింది.రజినీ వున్న కూడా పెద్దగా ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేకపోయింది.ఇక సినిమా విడుదలై ఏడాది కిపైగా అవుతున్న ఇప్పటివరకు ఓటిటి లోకి రాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఎట్టకేలకు లాల్ సలామ్ కు ఓటిటి భాగ్యం కలిగింది.సన్ నెక్స్ట్ జూన్ 6 నుండి ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.స్పోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈసినిమాలో విష్ణు విశాల్ ,విక్రాంత్ ,జీవిత, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.
ఇక ఈసినిమా తరువాత రజినీకాంత్ నెక్స్ట్ కూలీతో రానున్నాడు.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమాలో కింగ్ నాగార్జున ,ఉపేంద్ర ,శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.ఆగస్టు 14న రిలీజ్ కానుంది.
ఇదిలావుంటే రజినీ ప్రస్తుతం జైలర్ 2లో నటిస్తున్నాడు.ఇండస్ట్రీ హిట్ జైలర్ కు సీక్వెల్ గా వస్తుంది.నెల్సన్ డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సన్ పికర్స్ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























