కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

థగ్ లైఫ్.. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు

Actress Trisha Excited About Her Character in Thug Life

థగ్ లైఫ్.. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు

Actress Trisha Excited About Her Character in Thug Life

Actress Trisha Excited About Her Character in Thug Life

యూనివర్సల్ కమల్ హాసన్ ప్రధానపాత్రలో, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'థగ్ లైఫ్'. ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.

హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు 'థగ్ లైఫ్' భారీగా విడుదల చేయబోతోంది. ఈ రోజు మేకర్స్ వైజాగ్‌లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరోయిన్ త్రిష మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. 'వర్షం' సినిమా రిలీజై 22 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ ఇంత అభిమానం చూపిస్తున్న మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వైజాగ్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో కమల్ హాసన్ గారితో ఫస్ట్ టైం కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఇంద్రాణి అనే క్యారెక్టర్ చేశాను. తప్పకుండా ఆడియన్స్‌కి గుర్తుండిపోయే పాత్ర ఇది. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. తప్పకుండా ఈ సినిమా మీరు చూడాలి. కచ్చితంగా మీకు నచ్చుతుంది" అని అన్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్