ఓజీ తో అది తీరింది – శింబు

Thug Life Actor Simbu Excited For Sung A Song in Pawan Kalyan's OG Movie

యూనివర్సల్ కమల్ హాసన్ ప్రధానపాత్రలో, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా సెన్సేషన క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. గతంలో విక్రమ్, అమరన్ లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్ లైఫ్’ భారీగా విడుదల చేయబోతోంది. ఈ రోజు మేకర్స్ వైజాగ్‌లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో శింబు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. తెలుగు అభిమానులందరికీ ధన్యవాదాలు. జూన్ 5న ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా మంచి సినిమాలు సపోర్ట్ చేస్తారు. ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. జూన్ 5న మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను.” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఓజీలో ఒక పాట పాడాను. ఆ పాట త్వరలోనే రిలీజ్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ కోసం ఎప్పటినుంచో ఒక పాట పాడాలని ఉండేది. అది ఓజీ తో తీరింది. పవన్ కళ్యాణ్ గారి హరి హర వీరమల్లు సినిమా కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఆ టీమ్ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.