డబ్బింగ్ పూర్తి చేసిన పవన్

Pawan Kalyan wraps dubbing for Hari Hara Veera Mallu

చాలా రోజుల తరువాత తెలుగులో పెద్ద సినిమా రిలీజ్ కానుంది.అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు.జూన్ 12 న పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో వుంది.ఇందులో భాగంగా పవన్ డబ్బింగ్ కూడా పూర్తి చేశాడు.పవన్ షూటింగ్ చేశాక రాత్రి 10గంటలకు ఈసినిమా డబ్బింగ్ చెప్పేశాడు.కేవలం నాలుగు గంటల్లోనే డబ్బింగ్ అంతా కంప్లీట్ చేశాడు.సో అనుకున్న డేట్ కే ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. వచ్చే వారంలో ఈ ట్రైలర్ ను వదలనున్నారు.ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ తో రిలీజ్ అయ్యే ఛాన్స్ వుంది.ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నారు.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను క్రిష్ ,జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయగా నిధి అగర్వాల్ ,నోరా ఫతేహి, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఏఏం రత్నం ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఇక పవన్ ప్రస్తుతం ఓజీ షూటింగ్ తో బిజీ గా వున్నాడు.రీసెంట్ గానే ఓ షెడ్యూల్ కంప్లీట్ కాగా ప్రస్తుతం ముంబై లో ఓ షెడ్యూల్ జరుగుతుంది.ఇందులో పవన్ కూడా జాయిన్ అయ్యాడు. సుజీత్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.దానయ్య డివివి నిర్మిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు.సెప్టెంబర్ 25 న ఓజీ థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.