‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ హీరోయన్‌గా నటిస్తోన్న తాజా చిత్రం ‘8 వసంతాలు’. ఇందులో ఆమె ‘శుద్ధి అయోధ్య’ పాత్రలో కనిపించనుంది. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘మను’ ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా తెరకెక్కుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
షూటింగ్ దాదాపు పూర్తయింది. దీంతో మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లతో రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, శుద్ధి అయోధ్య క్యారెక్టర్ టీజర్‌తో క్యూరియాసిటీని పెంచిన మేకర్స్, తాజాగా 8 వసంతాలు విడుదల తేదీని ప్రకటించారు. హృదయాన్ని కదిలించే ఈ ప్రేమ గాథ మరో మూడు వారాలలో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచబోతోంది.
జూన్ 20న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనంతిక పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో అనంతిక సనీల్ కుమార్ బ్యూటీఫుల్‌గా వున్నారు. అద్భుతమైన చీరలో ఆమె ప్లజెంట్‌గా కనిపించారు. ఆమె జుట్టులో గులాబీ ఆమె లుక్, క్యారెక్టర్ నేచర్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.
ఇక ఈ సినిమాలో హను రెడ్డి, అనంతిక జంటగా నటిస్తుండగా.. రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తుండగా.. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, శశాంక్ మాలి ఎడిటింగ్, అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: