‘పద్మభూషణ్’ అందుకున్న శోభన, అనంత్‌ నాగ్‌

Actress Shobana and Actor Anant Nag Receives Padma Bhushan Award

ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి శోభన చంద్రశేఖర్ మరియు కన్నడ నటుడు ‘కేజీఎఫ్’ ఫేమ్ అనంత్‌ నాగ్‌ ‘పద్మ భూషణ్‌’ అవార్డు అందుకున్నారు. ఈ మేరకు తాజాగా రాష్ట్రపతి భవన్‌ వేదికగా జరిగిన పద్మ అవార్డుల వేడుకలో వారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. కాగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినీ రంగానికి చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం శోభన, అనంత్‌ నాగ్‌ లకు ‘పద్మ్ఘభూషణ్‌’ పురస్కారాన్ని ప్రకటించింది. నటిగానే కాకుండా, భరతనాట్య కళాకారిణి అయిన శోభన ఎన్నో వేదికలపై తన నృత్య ప్రతిభను ప్రదర్శించారు. అలాగే గత 5 దశాబ్దాలుగా అనంత్ నాగ్ తన బహుముఖ ప్రజ్ఞతో భారతీయ సినిమాకు సేవలందించారు. ఇక ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నారు. కాగా ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మరియు కోలీవుడ్‌ స్టార్ హీరో ‘తల’ అజిత్‌ కుమార్ సైతం ‘పద్మభూషణ్‌’ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.