ఓజీ.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చిన నారా రోహిత్‌

Nara Rohit Fiancee Sireesha Lella to Play Key Role in Pawan Kalyan's OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ ‘ఓజీ’ చిత్రానికి సంబంధించి యంగ్ హీరో నారా రోహిత్ ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయనకు కాబోయే భార్య నటిస్తోందటూ క్రేజీ న్యూస్ పంచుకున్నారు. ఈ మేరకు బెల్లంకొండ శ్రీనివాస్ మరియు మంచు మనోజ్ లతో కలిసి నారా రోహిత్ హీరోగా నటించిన భైరవం సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక విషయం వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ యాంకర్‌గా ఈ ఇంటర్వ్యూ జరుగగా.. తేజ్ ఓజీ అప్‌డేట్‌ ఏదయినా చెప్పమని రోహిత్‌ను అడుగగా, ఆయన బదులిస్తూ.. ఈ సినిమాలో నాకు కాబోయే భార్య నటించిందని తెలిపారు. ఆమె పాత్ర మూవీలో కీలకంగా ఉంటుందని వెల్లడించారు. దీంతో అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో మంచు మనోజ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇన్ని రోజులూ ఈ విషయం ఎందుకు చెప్పలేదంటూ రోహిత్‌ని సరదాగా ప్రశ్నించారు.

కాగా ప్రస్తుతం రోహిత్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో నారా రోహిత్ కాబోయే భార్య ఎవరా? అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరంటే..? ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సిరి లేళ్ల (శిరీష). విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన ఆమె నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చింది. హైదరాబాద్‌లో త‌న అక్క ఇంట్లో ఉంటూ మోడలింగ్ చేస్తూ ఆడిషన్స్‌ ఇస్తుండేది.

ఈ క్రమంలో గతేడాది రిలీజైన నారా రోహిత్ ‘ప్రతినిధి 2’లో అవకాశం వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇరువురూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్ళికి సిద్ధమయ్యారు. నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే అనూహ్యంగా రోహిత్ తండ్రి నారా రామ్మోహన్ నాయుడు అనారోగ్యంతో కన్ను మూయడంతో వివాహం ఆల‌స్యం అయింది. కాగా త్వరలోనే వీరు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతున్నారు.

కాగా  ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ‘ఓజీ’ సినిమాకు ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సాంగ్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.