యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’. ఈ భారీ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా సెన్సేషన క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా చెన్నైలో భారీ ఆడియో లాంచ్ ఈవెంట్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక నాయకుడు కమల్ హాసన్, అభిరామి, నాజర్, అశోక్ సెల్వన్, సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్ సహా పలువురు నటీనటులు, టెక్నీషియన్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో శింబు మాట్లాడుతూ.. ‘‘మద్రాస్ టాకీస్ బ్యానర్ వారికి, సుహాసిని గారికి, శివ గారికి, నిత్యా గారికి థాంక్స్. రాజ్ కమల్ ఫిల్మ్స్ మహేంద్రన్గారికి థాంక్స్. డిస్నీకి ధన్యవాదాలు. సినిమాను విడుదల చేస్తున్న రెడ్ జెయింట్ ఉదయ్ గారికి, శెంబగమూర్తి గారికి ధన్యవాదాలు. ఈ సినీ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్‌కు థాంక్స్. నేను చాలా మంది యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌తో వర్క్ చేశాను. తొలిసారి అన్బరివు మాస్టర్స్‌తో వర్క్ చేశాను. చాలా బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్. అలాగే సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్గారికి ధన్యవాదాలు.”
“జోజో జార్జ్ గారంటే నాకెంతో ఇష్టం. ఆయన స్క్రీన్ ప్రెజన్స్ చూసి నాకు అసూయగా ఉంటుంది. ఐశ్వర్య లక్ష్మి గారికి థాంక్స్. నాజర్ గారితో కలిసి చాలా సినిమాలకు వర్క్ చేశాను. అయితే ఈ సినిమాలో ఆయనతో కలిసి పని చేయటం ఎంతో స్పెషల్‌గా అనిపించింది. అభిరామిగారి పెర్ఫామెన్స్ గురించి అందరూ మాట్లాడుకునేంత గొప్పగా ఉంటుంది. అశోక్ సెల్వన్ గ్రేట్ టాలెంటెడ్. తను ఫ్యూచర్లో ఇంకా ఎదుగుతాడు. త్రిషతో కలిసి నేను ‘వినతాండి వారువాయ’ సినిమా చేశాను. ఈ సినిమా ట్రైలర్ చూసి అందరూ షాక్ అయ్యుంటారు.”
“త్రిష గారు చెప్పినట్లు ఇందులో చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. రెహమాన్ గారిని నెనెంతో ఇబ్బంది పెట్టాను. ఆయనతో ట్రావెల్ ఎప్పటికీ మరచిపోలేను. ఆయన నాకెంతో చేశారు. సింగర్‌గా నాకు మొదటిసారి అవకాశం ఇచ్చింది రెహమాన్ గారే. ఇప్పటి వరకు దాదాపు 150 పాటలు పాడాను. మణిరత్నం గారి గురించి చెప్పాలంటే.. ఆయన డైరెక్ట్ చేసిన ‘అంజలి’ మూవీలో అంజలి క్యారెక్టర్‌కు అన్న పాత్రలో నటించిన తెలుగు అబ్బాయిని స్క్రీన్‌పై చూసి ఆ పాత్రకు మణిగారు నన్నెందుకు తీసుకోలేదని ఏడ్చాను.”
“అప్పుడు మానాన్నగారు ఏదో చెప్పి నన్ను ఓదార్చారు. నేను పెరిగి పెద్దయ్యాక మాస్ మసాలా మూవీస్‌లోనే ఎక్కువగా నటించాను. దాంతో మణిగారితో సినిమా చేయలేనేమో అని అనుకున్నాను. ఆ సమయంలో నాపై రెడ్ కార్డ్ వేసే సందర్భం వచ్చింది. అప్పుడు చాలా మంది నిర్మాతలు నాతో సినిమా చేయటానికి చాలా భయపడ్డారు. అలాంటి సమయంలో నాకు మద్రాస్ టాకీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వెళ్లి మణిరత్నం గారిని కలిశాను.”
“నాతో సినిమా చేయటానికి నిర్మాతలు భయపడుతున్న సమయంలో నాపై నమ్మకంతో సినిమా చేసిన ఆయన్ని ఎప్పటికీ మరచిపోలేను. థగ్ లైఫ్‌లో ముందు నన్ను చేయమంటే కొన్ని కారణాలతో చేయలేనని చెప్పేశాను. కానీ మళ్లీ ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం దక్కింది. అది కూడా ఏకంగా కమల్ సార్‌తో నటించే అవకాశం దక్కింది. థగ్ లైఫ్‌లో ఇలాంటి పాత్ర ఇచ్చిన ఆయన్ని ఎప్పటికీ మరచిపోలేను.”
“కమల్‌హాసన్‌గారి గురించి చెప్పాలంటే మాట్లాడుతూనే ఉండొచ్చు. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు.. కాబట్టి మనం ఆయన్ని గురువుగా భావిస్తే..ఆయన మాత్రం నేను స్టూడెంట్‌నే అని అంటుంటారు. బెస్ట్ స్టూడెంట్ దగ్గర నేర్చుకోవటంలో తప్పు లేదని నా భావన. కమల్‌హాసన్‌గారి నుంచి చాలా విషయాలను నేర్చుకునే అవకాశం కలిగింది. మరచిపోలేని అనుభవమిది. ఆయనిచ్చిన ఆత్మ విశ్వాసంతోనే.. ఆయనతో సమానంగా చేసే క్యారెక్టర్‌ను సులభంగా చేయగలిగాను.”
“అంత గొప్ప నటుడితో ఇప్పుడు నటించగలిగానంటే చిన్నప్పటి నుంచి నన్ను ఎంతగానో సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసిన నా తల్లిదండ్రులే కారణం. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. ఎవరి స్థానాన్నీ మరొకరు భర్తీ చేయలేరు. దాని కోసం చాలా కష్టపడాలి. కమల్ హాసన్ గారు అంత కష్టపడ్డారు కాబట్టే.. ఆయన ఈరోజు ఇంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు.”
“ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. కమల్‌గారు, మణిగారు నాపై నమ్మకంతో మంచి రోల్ ఇచ్చారు. ఇంకా కష్టపడుతూ మంచి పాత్రలు చేసి ఇంకా మంచి స్థానానికి చేరుకుని మీరు నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అభిమానులు గర్వపడేలా సినిమాలు చేస్తానని చెప్పాను. దానికి థగ్ లైఫ్ ఓ ఆరంభం మాత్రమే. జూన్5న రిలీజ్ అవుతోన్న థగ్ లైఫ్ సినిమానే సినిమా ఏంటనేది మాట్లాడుతుంది’’ అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























